గాంధీన‌గ‌ర్‌లో జోరుగా పారిశుధ్ద్య ప‌నులు

తాండూరు

గాంధీన‌గ‌ర్‌లో జోరుగా పారిశుధ్ద్య ప‌నులు
– ఎమ్మెల్యేకు కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన సంతోష్‌కుమార్ గౌడ్
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి : తాండూరు మున్సిప‌ల్ ప‌రిధి గాంధీన‌గ‌ర్‌లో పారిశుద్ధ్య ప‌నులు జోరుగా కొన‌సాగుతున్నాయి. ఇటీవ‌ల గ‌ల్లీగ‌ల్లీకి ఎమ్మెల్యే కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి వార్డులో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే. వార్డులో పారిశుద్ధ్య ప‌నుల‌ను స‌క్ర‌మంగా చేప‌ట్టాల‌ని ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి ఆదేశించారు.
దీంతో వార్డులో ప్ర‌తిరోజూ పారిశుద్ధ్య ప‌నులు చేస్తున్నారు. వార్డులో చెత్త‌, చెదారం, పిచ్చి మొక్క‌ల తొల‌గింపు చేస్తున్నారు. మురుగు కాలువ‌లో వ్య‌ర్థాల‌ను తొల‌గిస్తున్నారు.

ఎమ్మెల్యే కృత‌జ్ఞ‌త‌లు: సంతోష్‌కుమార్ గౌడ్
గ‌ల్లిగ‌ల్లికీ ఎమ్మెల్యే కార్య‌క్ర‌మంలో భాగంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి దృష్టికి ప‌లు స‌మ‌స్య‌లు తీసుకెళ్ల‌డం జ‌రిగింది. అందులో పారిశుద్ధ్యం, మురుగుకాలువ‌లు, విద్యుత్ స్థంబాల తొల‌గింపు వంటివి వివ‌రించ‌డం జ‌రిగింది. ప్ర‌స్తుతం వార్డులో పారిశుద్ధ్య ప‌నులు స‌క్ర‌మంగా జ‌రుగుతున్నాయి.
దుర్గంద‌పు ప్రాంతాలు శుభ్ర‌మ‌వుతున్నాయి. త్వ‌ర‌లోనే విద్యుత్ స్ధంబాల స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తామ‌ని అధికారులు తెలిపారు. గ‌ల్లిగ‌ల్లికీ ఎమ్మెల్యేలో భాగంగా వార్డు స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కారానికి చొర‌వ‌చూపిన ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు.