అందులో 20 మార్కులు వస్తే పాస్‌

కెరీర్ తెలంగాణ మహబూబ్ నగర్ రంగారెడ్డి వికారాబాద్ హైదరాబాద్

అందులో 20 మార్కులు వస్తే పాస్‌
– టెన్త్‌ స్డూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పిన విద్యాశాఖ
– ఆ ఒక్క షరతుతో అమలుకు నిర్ణయం
హైదరాబాద్‌, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టెన్త్‌ స్టూడెంట్స్‌కు గుడ్‌ న్యూస్ చెప్పింది. పదో తరగతి పరీక్షల్లో ఓ సబ్జెక్టులో 20 మార్కులు వస్తే పాస్‌ చేస్తామని ప్రకటన జారీ చేసింది. తెలంగాణ విద్యార్థులకు తెలుగు సబ్జెక్ట్‌ తప్పనిసరి చేసింది ప్రభుత్వం. ఈ నిబంధనల్లో భాగంగా.. ఇతర మీడియంలలో చదివే విద్యార్థులు తెలుగును కచ్చితంగా ఒక సబ్జెక్టుగా తీసుకవచ్చింది. అయితే ఇతర మీడియంలో చదివే పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పింది. ఇకపై పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో తెలుగు సబ్జెక్టుకు కేవలం 20 మార్కులు వచ్చినా.. పాస్ చేస్తామని ప్రకటించింది. కాని దీనికి ఓ షరతు వర్తింపజేస్తూ అమలు చేయాలని నిర్ణయించింది. అదేంటంటే పదో తరగతిలో తెలుగు సబ్జెక్టును సెకండ్ ల్యాంగ్వేజ్‌గా ఎంపిక చేసుకున్న విద్యార్ధులు మాత్రమే ఈ వెసులుబాటు వర్తిస్తుందని స్పష్టం చేసింది.