శాంతి, సామసర్యతకు ప్రతిరూపమే ఏసు మార్గం

తాండూరు రంగారెడ్డి రాజకీయం వికారాబాద్

శాంతి, సామసర్యతకు ప్రతిరూపమే ఏసు మార్గం
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
– రాజీవ్ కాలనీలో అట్టహాసంగా క్రిస్మస్ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : శాంతి, సామరస్యతకు ఏసు మార్గం ప్రతిరూపమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం తాండూరు పట్టణం రాజీవ్ కాలనీలోని నజరేతు చెర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు మాజీ మంత్రి మహేందర్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్లతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చెర్చ్ పాస్టర్ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. అనంతరం వారు మహేందర్ రెడ్డిని శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం మాజీ మంత్రి మహేందర్ రెడ్డి క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని కేకేను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ శాంతికి రూపం, దయగల హృదయుడు, లోక రక్షకుడైన యేసు మార్గం అందరికి అనుసరణీమని అన్నారు. అదేవిధంగా తాండూరులో చెర్చిల అభివృద్ధి, క్రైస్తవుల సంక్షేమానికి తోడ్పాటునందిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, డీసీసీబీ జిల్లా డైరెక్టర్ రవిందర్ గౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, మాజీ డీపీసీ సభ్యులు పట్టేళ్ల నర్సింలు, కౌన్సిలర్లు వెంకన్న గౌడ్, బోయరవి, పీఏసీఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, సాయిపూర్ బాల్‌రెడ్డి, మారేపల్లి బల్వంత్ రెడ్డి, గడ్డల రవీందర్, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, అగ్లసూర్ సర్పంచ్ భీమప్ప, యువనాయకులు బిర్కడ్ రఘు, అశోక్, శ్రీకాంత్ రెడ్డి, కాలనీ క్రైస్తవులు తదితరులు పాల్గొన్నారు.