ఎంఎంటీఎస్ సేవలను పొడగించండి
– రైల్వే పీఏసీ సభ్యులకు టీపీఏఎఫ్ వినతి
తాండూరు, దర్శిని ప్రతినిధి: హైదరాబాద్ నుంచి లింగంపల్లి వరకు కొనసాగుతున్న ఎంఎంటీఎస్ రైళ్ల సర్వీసులను తాండూరుకు వరకు పొడగించాలని రైల్వే మంత్రిత్వ శాఖ ప్రయాణికుల సౌకర్యాల కమిటీ(పీఏసీ) సభ్యుల బృందాన్ని తాండూరు పబ్లిక్ వాయిస్ ఫోరం(టీపీవీఎఫ్) సభ్యులు కోరారు. మంగళవారం తాండూరు రైల్వేస్టేషన్ ను సందర్శించిన పీఏసీ సభ్యుల బృందాన్నిఫోరం ప్రతినిధి జిలాని ఆధ్వర్యంలో కలిసి వినతిపత్రం అందించారు. తాండూరు మీదుగా గుంటూరు పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ఆపాలని కోరారు. హైదరాబాద్ లింగంపల్లి మద్య కొనసాగున్న ఎంఎంటీఎస్ వ్యవస్థను తాండూరు వరకు పొడగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను పరిష్కరిస్తే తాండూరు ప్రయాణికులకు ఎంతో మేలు జరుగుతుందని టీపీవీఎఫ్ సభ్యులు విన్నవించారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు భాను పవార్, వెంకటేష్ గౌడ్, నరేందర్ సింగ్ ఠాకూర్, వెంకట్ యాదవ్, ముల్లు యాదవ్, నరేష్, ప్రశాంత్, ప్రకాష్ తదితరులు ఉన్నారు.

