పట్టణం మొత్తం మెరిసేలా..!
– ప్రతి వార్డు అభివృద్ధికి ప్రణాళికలు
– పార్టీలకతీతంగా వార్డులకు నిధులు
-తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్యేను కలిసిన తాండూరు ప్రజా ప్రతినిధులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం మొత్తం మెరిసేలా మున్సిపల్ అభివృద్ధికి అందరు తోడ్పాటు అందించాలని, వార్డు అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్లో తాండూరుకు చెందిన ప్రజా ప్రతినిధులు, నేతలు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విఠల్ నాయక్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు, సీనియర్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి తదితరులు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో భేటీ అయ్యారు.

తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుకు కేటాయిస్తున్న రూ.1 కోటి నిధుల వినియోగంపై ఎమ్మల్యే రోహిత్ రెడ్డితో చర్చించారు. ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ తాండూరు మున్సిపల్ పరిధిలోని ప్రతి వార్డుకు పార్టీలకతీతంగా నిధులు కేటాయించడం జరుగుతుందన్నారు. ప్రతి వార్డులో నెలకొన్న సమస్యలను దశల వారిగా పరిష్కరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచించారు. ఇందుకు కౌన్సిలర్లు, వార్డు ఇంచార్జ్ లు బాధ్యత తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ స హాకారంతో తాండూరు మున్సిపల్ మొత్తం మెరిసేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆసిఫ్, విజయదేవి, సంగీత ఠాకూర్, అస్లాం, ఈ కోఆప్షన్ సభ్యురాలు సారంగా విజయ్, నాయకులు నరేందర్ గౌడ్, ఇర్ఫాన్, సలీం, ఉర్దూఘర్ చైర్మన్ రజాక్, బీఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షులు హరిహరగౌడ్, కార్యదర్శి సంతోష్ గౌడ్, నేతలు, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.

