విశ్రాంత ఉద్యోగుల సంఘంలో విషాధం

క్రైం తాండూరు రాజకీయం వికారాబాద్

విశ్రాంత ఉద్యోగుల సంఘంలో విషాధం
– గుండెపోటుతో అధ్యక్షులు రాంరెడ్డి కన్నుమూత
– సంతాపం ప్రకటించిన సంఘం సభ్యులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘము తాండూరు శాఖలో విషాధం నెలకొంది. సంఘం అధ్యక్షులు రాంరెడ్డి బుధవారం సాయంత్రం గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగుల సంఘం సభ్యులు రాంరెడ్డి మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. రాంరెడ్డి మరణం సంఘానికి తీరని లోటని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని సంతాపం ప్రకటించారు. అదేవిధంగా కుటుంబ సభ్యులకు మనః శాంతిని ప్రసాదించాలని ఆ భగవంతిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో సంఘము జిల్లా అసోసియేట్ అధ్యక్షులు జొన్నల బస్వారాజ్, తాండూరు మండల అసోసియేట్ అధ్యక్షులు సి. వీరేశం, మండల కోశాధికారి కే. పద్మనాభరావు, జిల్లా కార్యదర్శి కే. శేకేర్, జిల్లా సహా కార్యదర్శి సడిగి బస్వారాజ్ మరియు మండల విశ్రాంత ఉద్యోగులు ఉన్నారు.