ఆదర్శనీయురాలు సావిత్రి బాయి పూలే
– మహిళా సాధికారతకు నిలువెత్తు నిదర్శనం
– జాతీయ బీసీ సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి
– తాండూరులో ఘనంగా జయంతి వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : స్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి మహిళ ఉపాధ్యాయురాలు సమాజానికి గొప్ప ఆదర్శనీయురాలు అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వినర్ కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. మంగళవారం సావిత్రిబాయి పూలే 192 వ జయంతి పురస్కరించుకొని తాండూరులోని మాత్మ జ్యోతిబా ఫూలే వెనుకబడిన తరగతుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జాతీయ బిసి సంఘం కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి సావిత్రిబాయి చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ సబండ వర్గాల అభివృద్ధికి కృషిచేసిన జ్యోతిరావు పూలే సతీమణి సావిత్రి బాయి పూలే కులమత బేధాలకు అతితీయంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి అన్నారు. మహిళా సాధికారతకు నిలువెత్తు రూపంగా సావిత్రిబాయి పూలేను అభివర్ణించారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని అమ్మాయిలు, మహిళలు చదువులో రాణించినప్పుడే భారతదేశం పురోగతి సాధిస్తుందని అన్నారు. అదేవిధంగా సమాజంలో మహిళలు పురుషులతోపాటు సమానంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధి చెందినప్పుడే చట్టసభల్లో, రాజకీయ పార్టీలను మహిళలు శాసించినప్పుడే దేశ ఆర్థిక స్థితిగతులతో పాటు దేశ పురోగతి నిర్ణయాలను తీసుకున్నప్పుడే సావిత్రిబాయి పూలే కు నిజమైన నివాళులు అర్పించినట్లు అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, మహాత్మ జ్యోతిరావు పూలే హాస్టల్ ప్రిన్సిపాల్ పి.పండరయ్య, వైస్ ప్రిన్సిపల్ వి. రూపారాణి, తాండూరు నియోజకవర్గ బీసీ కార్యదర్శి రాధాకృష్ణ, సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్, బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్, జుంటుపల్లి వెంకట్, శివ, నాగరాజ్, సాయి ప్రసాద్, రాఘవేందర్, మతిన్, సయ్యద్, మహాదేవ్, సురేందర్, పాఠశాల ఉపాధ్యాయురాలు స్వరూప రాణి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


