అట్టహాసంగా విఠల్ నాయక్ జన్మదినం
– శుభకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– గజమాలతో సన్మానించిన బీఆర్ఎస్ నాయకులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ విఠల్ నాయక్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి నివాసంలో విఠల్ నాయక్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి విఠల్ నాయక్ ను శాలువాతో సన్మానించి.. ఫుష్పగుచ్చం అందించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఎమ్మెల్యే తండ్రి విఠల్ రెడ్డి, నేతల సమక్షంలో విఠల్ నాయక్ చేత కేక్ కట్ చేయించారు. అనంతరం విఠల్ నాయకులు విఠల్ నాయక్‌ను గజమాలతో సన్మానించి శుభాంక్షలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి విఠల్ నాయక్ నిండు ఆరోగ్యంగా జీవించాలని, పార్టీలో పదవులు చేపట్టి.. రాజకీయంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తాండూరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, కార్మిక సంఘం అధ్యక్షులు, న్యాయవాది గోపాల్, మాజీ కౌన్సిలర్ ఇర్ఫాన్, కౌన్సిలర్లు భీమ్ సింగ్ రాథోడ్, ముక్తార్ భాయ్, కోఆప్షన్ నెంబర్ వెంకట్ రామ్ నాయక్, ఉర్దూ ఘర్ చైర్మన్ రజాక్, పోట్లీ మహారాజ్ ఆలయ చైర్మన్ రాజన్ గౌడ్, పెద్దముల్ సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, యువ నాయకులు మోయీజ్, ఇమ్రాన్, రఫీ ఖాన్, అన్వర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ విఠల్ నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపి జన్మదినాన్ని సందడిగా నిర్వహించారు.
విఠల్ నాయక్‌కు శుభాకాంక్షలు తెలిపిన నేతలు


