రంగవల్లులు సంప్రదాయ ప్రతిబింబాలు

తాండూరు రాజకీయం వికారాబాద్

రంగవల్లులు సంప్రదాయ ప్రతిబింబాలు
– పెద్దేముల్ వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాసచారి
– కందనెల్లిలో అలరించిన ముగ్గుల పోటీలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: సంక్రాంతి రంగవల్లులు తెలుగు సంస్కృతి ప్రతిబింబాలు అని పెద్దేముల్ మండల వైస్ ఎంపీపీ మధులత శ్రీనివాసచారి అన్నారు. ఆదివారం పెద్దేముల్ మండలంలోని కందనెల్లిలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలో గ్రామ యువతులు, మహిళలు భారీ ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా, న్యాయ నిర్ణీతగా వైస్ ఎంపీపీ మదలత హాజరయ్యారు. మహిళలు, యువతులు వేసిన ముగ్గులను పరిశీలించారు. ఈ పోటీలో మొదటి బహుమతి సంధ్య, రెండో బహుమతి పావని, మూడో బహుమతి భూమి శిరీషలు గెలుచుకున్నారు.

ఈ సందర్భంగా వైస్ ఎంపీపీ మధులత మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండ్ల ముందు వేసే ముగ్గులు సంప్రదాయానికి ప్రతిబింబాలన్నారు. అందేవిధంగా రంగవల్లులు మహిళలకు ఆరోగ్యాన్ని సైతం పెంపొదిస్తాయని అన్నారు. ప్రతి సంవత్సరం సంక్రాంతికి సంస్కృతి చాటే విధంగా అంబేద్కర్ యువజన సంఘం పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టీయూటబ్ల్యూజే ఐజేయూ జర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసచారి, అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు నర్సింలు, జనార్ధన్, రాములు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.