కంటి వెలుగు ఆదర్శం
– పేదల కంటిచూపుకు భరోసా
– అందరు సద్వినియోగం చేసుకోవాలి
– ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. గురువారం యాలాల మండలంలో సర్కారు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు 2.0 కార్యక్రమానికి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఇలాంటి కంటి వెలుగు కార్యక్రమం దేశంలో ఎక్కడ లేని విధంగా అద్భుతమైన కార్యక్రమం అన్నారు. కంటి సమస్యలను పరిష్కరించేందుకు కార్యక్రమాన్ని చేపట్టడంపై సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు ధన్యవాదాలు తెలిపారు. గతంలో చేపట్టిన కంటి వెలుగు ఎంతో విజయవంతం అయ్యిందన్నారు. అందుకే రెండో విడత కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. ఇందులో పేదలకు ఉచితంగా కంటి పరీక్షలు, మందులు, ఆపరేషన్లు నిర్వహిస్తారని అన్నారు. పేదలందరు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కంటి వెలుగు 2.0తో పేదల కంటి చూపుకు భరోసా అందిస్తుందని, అందుకే కార్యక్రమం దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో యాలాల పీఏసీఎస్ చైర్మెన్ సురేందర్ రెడ్డి, సర్పంచ్ సిద్రాల సులోచన, ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్, అగ్గనూర్ సర్పంచ్ భీమప్ప, బి జె యదప్ప, అశోక్, వెంకటయ్య, యువ నాయకులు సిద్రాల శ్యామ్, బి.రఘు, పునీత్ కుమార్, ఇర్ఫాన్, సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

