షేక్ ఫాతిమా గొప్ప ఆదర్శమూర్తి

కెరీర్ తాండూరు రాజకీయం వికారాబాద్

షేక్ ఫాతిమా గొప్ప ఆదర్శమూర్తి
– అందరూ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలి
– మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు కె.గోపాల్
– ఘనంగా షేక్ పాతిమా జయంతి ముగింపు
తాండూరు, దర్శిని ప్రతినిధి: భారత మొట్ట మొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలు షేక్ ఫాతిమాను గొప్ప ఆదర్శమూర్తి అని.. అందరు ఆమెను ఆదర్శంగా తీసుకోవాలని తాండూరు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాది, బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షులు కె.గోపాల్ అన్నారు. బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు డివిజన్ అధ్యక్షులు పి.జిలానీ ఆధ్వర్యంలో షేక్ ఫాతిమా జయంతి ఉత్సవాలు నిర్వహించారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మైనార్టీ బాలికల గురుకుల పాఠశాలలో షేక్ ఫాతిమా జయంతి ముగింపు సభ నిర్వహించారు. అంతకుముందు మైనార్టీ బాలికల పాఠశాల, కళాశాల విద్యార్థులకు షేక్ ఫాతిమా జీవిత చరిత్రపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన న్యాయవాది కె.గోపాల్ ఉర్దూఘర్ చైర్మన్ అబ్దుల్ రజాక్ తో కలిసి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశ మొట్ట మొదటి ముస్లిం మహిళ ఉపాధ్యాయురాలుగా షేక్ ఫాతిమా విద్యాభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. విద్యతో పాటు కుల రహిత సమాజ నిర్మాణానికి పాటు పడ్డారని అన్నారు. ఆమెను అందరు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి పాఠశాల, కళాశాలలో పాటు ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు నుంచి పేరు తీసుకరావాలన్నారు. అదేవిధంగా పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతులను అందజేస్తామని బీఆర్ఎస్‌వీ డివిజన్ ఇంచార్జ్ పి.జిలాని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ మహబూబ్ ఫాతిమా, న్యాయవాదులు శ్రీనివాస్, కలాం, విద్యార్థులు పాల్గొన్నారు.