సొంత పార్టీ అయినా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

సొంత పార్టీ అయినా..!
– కుర్చి దింపుతాం.. దిగాల్సిందే
– తాండూరు చైర్ పర్సన్‌పై అవిశ్వాసం
– జిల్లా కలెక్టర్‌కు తీర్మానం అందజేత
– ప్రకటించిన గ్రంథాలయ చైర్మన్, వైస్ చైర్ పర్సన్
తాండూరు, దర్శిని ప్రతినిధి: సొంత పార్టీ అయినా సరే తాండూరు మున్సిపల్ చైర్‌ పర్సన్‌ను కుర్చి దించుతాం.. దిగి పోవాల్సిందే అని వికారాబాద్‌ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా సంచలన వాఖ్యలు చేశారు. శనివారం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కె.నిఖిలను కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌పై అవిశ్వాసన తీర్మానం ప్రకటించాలని వినతిప్రతం అందజేశారు. అనంతరం గ్రంథాలయ చైర్మన్ రాజుగౌడ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు మాట్లాడుతూ మూడేళ్ల కాలంగా చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అభివృద్ధి చేపట్టలేదన్నారు. సొంత పార్టీలో ఉన్న కూడా కోర్టుకెక్కి పట్టణ ప్రగతిని విస్మరించారని అన్నారు. మున్సిపల్ కొత్త చట్టం 2019 ఆర్టికల్ 37 ప్రకారం ఆమెపై అవిశ్వాసం పెట్టాలని కలెక్టర్‌కు తీర్మానం అందించామని తెలిపారు. చైర్‌ పర్సన్‌పై అవిశ్వాసం పెట్టేందుకు 24 మంది కౌన్సిలర్ల మద్దతు తీసుకోవడం జరిగిందన్నారు. అధికార పార్టీకి చెందిన 13 మంది కౌన్సిలర్లు, బీజేపీ నుంచి 5 మంది, టీజేఎస్ నుంచి 1, కాంగ్రెస్ నుంచి ఇద్దరు, ఎంఐఎం నుంచి ముగ్గురు కౌన్సిలర్లు సంతకాలు చేశారని వివరించారు. అభివృద్ధిని విస్మరించిన చైర్‌ పర్సన్‌ను గద్దె దించి తీరుతామని.. అవిశ్వాసం నెగ్గుతామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, విజయదేవి, లతా గౌడ్, సిందూజ గౌడ్, సంగీత ఠాకూర్, అశ్విని గుండప్ప, ఎర్రం వసంత, ఆసిఫ్‌, ముక్తార్, భీంసింగ్, అస్లాం, బొంబీనా, అఫ్రీన్, సోమశేఖర్, వరాల శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, నరేందర్ గౌడ్, అబ్దుల్ సలీం తదితరులు ఉన్నారు. మరోవైపు చైర్‌ పర్సన్‌ పై అవిశ్వాసం ప్రకటించడం తాండూరు రాజకీయాలలో ప్రకంపనలు రేపింది. వైస్ చైర్ పర్సన్ వర్గంకు ప్రస్తుతం ఉన్న 24 మంది కౌన్సిలర్ల మద్దతుతో పాటు ఎమ్మెల్సీ వర్గం నుంచి మరో నలుగురు మద్దతు అందించేందుకు సిద్దమైనట్లు ప్రచారం సాగింది.