దొంగల గుడి..!

ఆరోగ్యం జాతీయం తెలంగాణ హైదరాబాద్

దొంగల గుడి..!
– అక్కడ చోరీ చేస్తే అనుకున్నవి తీరుతాయి
– సంతాన దేవాలయంగా ప్రసిద్ది చెందిన వైనం
– ఆ దేవాలయం ఎక్కడ ఉందంటే
దర్శిని డెస్క్‌: మన భారత దేశంలో దొంగతనానికి ఓ గుడి ఉంది. ఇది వింటే ఆశ్యర్యంగా అనిపిస్తుంది. కదూ..! కాని ఆ దేవాలయం నిజం.. అక్కడ దొంగతనం సంప్రదాయం. దేశంలో ఎన్నో పవిత్రమైన దేవాలయాలు ఉన్నాయి. ఆ దేవాలయాలక పవిత్రమైన మనసుతో ఆలోచనలతో వెళ్లారు. భక్తితో భగవంతున్ని దర్శించుకుంటారు. కానుకలు సమర్పిస్తారు. కానీ ఇక్కడ ఓ దేవాలయానికి కేవలం దొంగతనం చేయడానికే వెళ్తారట. అక్కడ దొంగతనం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అదే ఉత్తరాఖండ్‌లోని చూడామణి దేవాలయం. ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కికి 19 కిలో మీటర్ల దూరంలో భగవాన్‌ సమీపంలో ఉంది.

సంతాన కోరికలకు ప్రసిద్ధి
ఇంతటి ప్రాచూర్యం ఉన్న ఈ దేవాలయంలో వందల ఏళ్లుగా దొంగతనం చేయాలనే ఆచారం అక్కడ కొన్ని వందల ఏళ్లనుంచి కొనసాగుతోందట. ఎవరైనా దంపతులకు పిల్లలు పుట్టకపోతే, ఈ అమ్మవారి ఆలయంలో దొంగతనం చేస్తే.. వారికి సంతానం కలుగుతుందట. అది అక్కడి భక్తుల ప్రగాఢ విశ్వాసం. అందుకే ఈ ఆలయం సంతాన ఆలయంగా ప్రసిద్ధి చెందింది.

ఏం దొంగతనం చేస్తారో తెలుసా
చూడామణి ఆలయంలో ఏది పదితే.. దొంగతనం చేయడానికి వీలు లేదని ఆలయ పండితులు చెబుతున్నారు. ఆలయంలో వెలసిన చూడామణి పాదాల వద్ద ఉంచిన చెక్క బొమ్మలను మాత్రమే దొంగతనం చేయాలని, వాటిని ఇంటికి తీసుకెళ్లి ఉంచుకోవాల్సి ఉంటుందని వివరించారు. సంతానం కలిగిన తరువాత దొంగలించిన చెక్క బొమ్మలను ఎక్కడ దొంగిలించారో.. అక్కడ ఉంచాలని, దొంగిలించిన చెక్క బొమ్మలకు మరో బొమ్మను జోడించాల్సి ఉంచాలనే నియమం ఉందని చెబుతున్నారు.