పార్లమెంట్ ముట్టడికి సిద్దం కావాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

పార్లమెంట్ ముట్టడికి సిద్దం కావాలి
– చలో ఢిల్లీని విజయవంతం చేద్దాం
– బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కె.రాజ్ కుమార్
– ఆర్.కృష్ణయ్య చేతుల మీదుగా పోస్టర్ ఆవిష్కరణ
తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ డిమాండ్ల సాధన కోసం బీసీ యువత పార్లమెంట్ ముట్టడికి సిద్ధం కావాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ అన్నారు. శనివారం హైదరాబాద్‌లో బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా ఈ నెల 8,9 వ తేదిలలో చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని, జన గణన చేపట్టాలని డిమాండ్లతో చలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ఈనెల 8,9వ తేదిలలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మహాధర్నా, పార్లమెట్ ముట్టడికి యువత భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు గుజ్జ కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, సత్యం, యాలాల మండల అధ్యక్షులు లక్ష్మణచారి, ముంబాపూర్ సర్పంచ్ శ్రావణ్, హన్మాపూర్ సర్పంచ్ వెంకటేష్, మారేపల్లి తాండా సర్పంచ్ పాండు, పెద్దముల్ బీఆర్ఎస్ యువనాయకులు సంగమేశ్వర్, నాయకులు వెంకటయ్య, పెంటయ్య, బాలయ్య, మార్కెట్ కమిటి డైరెక్టర్ ముజీబ్, కురుమ సంఘం అధ్యక్షులు వెంకటప్ప, స్వరాజ్, దేవరాజ్. మతీన్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.