క్రికెట్లో సత్తా చాటు..!
– క్రీడాకారునికి రినీష్ రెడ్డి ప్రోత్సహాం
– రూ. 5వేలు అందించిన ఎమ్మెల్సీ కుమారుడు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ప్రతిభ ఉంటే ఏది అడ్డు కాదని.. క్రికెట్లో సత్తా చాటాలని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు రినీష్ రెడ్డి గ్రామీణ ప్రాంతానికి చెందిన క్రికెట్ క్రీడాకారుడు శ్రీనివాస్‌ను ప్రోత్సహించారు. తాండూరు నియోజకవర్గం బషీరాబాద్ మండలం ఎక్మాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ నేపాల్‌లో జరిగే అండర్-19 క్రికెట్ టోర్నమెంట్‌కు ఎంపికయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనయుడు బుధవారం పట్టనంలోని ఎమ్మెల్సీ నివాసంలో శ్రీనివాస్‌ను అభినందించారు. క్రికెట్లో రాణిస్తున్న సందర్భంగా శాలువాతో సత్కరించి సన్మానించారు. అదేవిధంగా శ్రీనివాస్‌కు రూ. 5వేల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా రినీష్ రెడ్డి మాట్లాడుతూ శ్రీనివాస్ క్రికెట్లో సత్తా చాటాలని ఆకాంక్షించారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు తమవంతు ప్రోత్సహం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, జెడ్పీటీసీ గౌడి మంజుల వెంకటేశం, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, యువనాయకులు తదితరులు పాల్గొన్నారు.

