బండి సంజయ్ పర్యటన రద్దు
– త్వరలో కొత్త తేది ప్రకటన
– వెల్లడించిన జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్
తాండూరు, దర్శిని ప్రతినిధి: బీజేపీ తెలంగాణ రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తాండూరు పర్యటన రద్దు అయినట్లు ఆ పార్టీ వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ తెలిపారు. బుధవారం బండి సంజయ్ తాండూరులో పర్యటించనున్నట్లు నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. యాలాల మండలం దేవనూర్ గ్రామంలో జరిగిన శివ స్వాములపై కేసు నమోదులో బాధితులను బండి సంజయ్ పరామర్శిస్తారని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ మురళీకృష్ణ గౌడ్ కుటుంబ సభ్యులను కూడా పరామర్శిస్తారని ప్రకటించారు. అదేవిధంగా పార్టీ పిలుపు మేరకు తాండూరు పట్టణంలోని భద్రేశ్వర చౌరస్తాలో స్ట్రీట్ కార్నర్ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. కాని అనివార్య కారణాల వల్ల బండి సంజయ్ రాక రద్దు అయినట్లు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి యు.రమేష్ కుమార్ గురువారం ప్రకటించారు. మళ్లీ బండి సంజయ్ ఎప్పుడు వస్తారనే తేదిని త్వరలో ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు, అభిమానులు, ప్రజలు గమనించాలని సూచించారు.

