అంబేద్క‌ర్ బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్యుడు

తాండూరు రాజకీయం వికారాబాద్

అంబేద్క‌ర్ బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్యుడు
– నివాళులు అర్పించిన ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాల ఆరాధ్యుడు డా.బీఆర్. అంబేద్క‌ర్ అని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమ‌వారం అంబేద్క‌ర్ 65వ వ‌ర్దంతిని పుర‌స్క‌రించుకుని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల‌యంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అంబేద్క‌ర్ చిత్ర‌ప‌టానికి పూల‌మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ పేద ప్ర‌జ‌లు ఆత్మ‌గౌర‌వంతో జీవీంచేందుకు అంబేద్క‌ర్ రాజ్యాంగంలో హ‌క్కులు క‌ల్పించార‌ని అన్నారు. అందుకే అట్ట‌డుగు, బ‌డుగు బ‌ల‌హీర్గాల‌కు అంబేద్క‌ర్ ఆరాధ్యుడుగా మారార‌ని అభివ‌ర్ణించారు. అంబేద్క‌ర్ సిద్దాంతాల‌ను పాటిస్తూ ఆయ‌న ఆశ‌యాల‌తో అంద‌రి హ‌క్కుల‌ను కాపాడేందుకు కృషి చేయాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో తాండూరు మార్కెట్ క‌మిటి చైర్మ‌న్ విఠ‌ల్ నాయ‌క్, వైస్ చైర్మ‌న్ వెంక‌ట్ రెడ్డి, టీఆర్ఎస్ ప‌ట్ట‌ణ అధ్య‌క్షులు అఫ్పూ(న‌యూం), సీనీయ‌ర్ నాయ‌కులు రాజుగౌడ్, ప‌ట్లోళ్ల న‌ర్సింలు, శ్రీ‌నివాస్ చారి, న‌ర్సిరెడ్డి, పెద్దేముల్ మండ‌ల అధ్య‌క్షులు కోహిర్ శ్రీ‌నివాస్ యాద‌వ్, యువ‌నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.