శోభాయత్రలో వెల్లిసిన మతసామరస్యం

ఆరోగ్యం తాండూరు రాజకీయం వికారాబాద్

శోభాయత్రలో వెల్లిసిన మతసామరస్యం
– చలివేంద్రంతో దహార్తిని తీర్చిన మైనార్టీ నేతలు
– అభినందించిన పట్టణ వాసులు
తాండూరు, దర్శిని ప్రతినిధి: హిందువుల పండగ కార్యక్రమాలు, ముస్లింల పండగ కార్యక్రమాల్లో మతసామరస్యతను చాటడం జరుగుతుంది. తాజాగా తాండూరు పట్టణంలో నిర్వహించిన శివాజీ శోభాయాత్రలో స్థానిక మైనార్టీ నాయకులు మతసామరస్యతను చాటారు. ఆదివారం చత్రపతి శివాజీ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన శోభాయాత్రలో పాల్గొన్న వారి కోసం చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి దాహార్తిని తీర్చారు. తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు తాండూరుకు చెందిన మైనార్జీ వాయకులు ఎండి ఏజాజ్, ఈర్షాద్‌ తదితరులు పట్టణంలోని శివాజీ చౌరస్తా వద్ద చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. శోభాయాత్రలో పాల్గొన్న వారికి తాగునీరు పంపిణీ చేసి సేవా దృక్పథాన్ని చాటుకున్నారు. శోభాయాత్రలో మతసామరస్యతను చాటడం పట్ల పలువురు అభినందనలు తెలిపారు.