సరిహద్దులో రాకపోకలు బంద్
– తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు రవాణా నిలిపివేత
– ఈనెల 25 వరకు ఆంక్షలు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ మేరకు పోలీసు అధికారులు ప్రకటనలో తెలిపారు. ఈనెల 25 వరకు రవాణా స్థంభించి పోతుంది. కృష్ణా నది వంతెనకు మరమ్మతులు చేస్తున్న కారణంగా వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. రహదారికి బారికేడ్లు ఏర్పాటు చేసి మూసివేశారు. ఈ మార్గంలో వెళ్లే వాహనాలను భూత్పూర్, ఎర్రవల్లి చౌరస్తా, గద్వాల, ధరూర్ మీదుగా రాయచూర్‌కు మళ్లిస్తున్నట్లు వెల్లడించారు. యాద్గిర్, నారాయణపేట నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలను.. మరికల్, అమరచింత, జూరాల డ్యామ్, ధరూర్ మీదుగా రాయచూర్‌కు మళ్లిస్తున్నారు. నిలిచిపోయిన వాహనాలను ఎన్‌హెచ్-167 మీదుగా రాయచూర్ వెళ్లే వాహనాలు దారి మళ్లించారు. హైదరాబాద్, మహబూబ్నగర్ నుంచి రాయచూర్ వెళ్లే వాహనాలు దారి మళ్లించినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.

