బీజేపీకి బీఆర్‌ఎస్‌ సెగ తప్పదు

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీకి బీఆర్‌ఎస్‌ సెగ తప్పదు
– గ్యాస్ ధరల పెంపుపై రేపు నిరసన
– హాజరుకానున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : ధరలను పెంచి పేదల నడ్డి విరుస్తున్న బీజేపీకి ప్రజల తరుపున బీఆర్ఎస్ సెగ చూపిస్తుందని ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా రేపు శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కేంద్రం వ్యతిరేక విధనానాలను నిరసిస్తూ మంత్రి కేటీఆర్ దర్నాలు, నిరసనలకు పిలుపునివ్వడం జరిగిందని, తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉదయం 9-30 గంటలకు దర్నా కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి హాజరవుతారని తెలిపారు. కావున పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, అనుబంధ సంఘాల నాయకులు, కోఆప్షన్ సభ్యులు, కార్యకర్తలు, యువకులు భారీ ఎత్తున తరలిరావాలని విజ్ఞప్తి చేశారు.