రోడ్డుపై చెత్తవేస్తే చిక్కులే..!

ఆరోగ్యం క్రైం తాండూరు వికారాబాద్

రోడ్డుపై చెత్తవేస్తే చిక్కులే..!
– జరిమానాలు విధిస్తున్న మున్సిపల్ అధికారులు
– ఉల్లంఘించిన హోటల్‌ యజమానికి ఫైన్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరులో స్వచ్ఛత పాటింపుపై అధికారులు శ్రద్ద చూపిస్తున్నారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించేలా చర్యలు చేపడుతున్నారు. దీంతో రోడ్లపై చెత్త వేస్తే వారికి చిక్కులు తప్పవంటున్నారు. తాజాగా నిబంధనను ఉల్లంఘించిన హోటల్ యజమానికి జరిమాన విధించారు. వివరాల్లోకి వెళితే.. శుక్రవారం మున్సిపల్ శానిటరి ఇనుస్పెక్టర్ ఉమేష్‌ కుమార్ ప్రత్యేక బృందంతో కలిసి పట్టణంలో తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ సమీపంలో ఉన్న సోయేల్ హోటల్ వ్యాపారి నిబంధనలకు విరుద్దంగా మున్సిపల్‌ డ్రైన్‌లో చెత్త వేసినందుకు రూ.500లు జరిమాన విధించారు. అదేవిధంగా పలు దుకాణాలలో తనిఖీలు నిర్వహించి జరిమానాలు విధించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎవరైనా చెత్తను మునిసిపల్ రోడ్డులలో కానీ డ్రైన్ లో కానీ వేస్తే జరిమానాలు విధించడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ తనిఖీలలో మున్సిపల్ ప్రత్యేక బృందం సభ్యులు పాల్గొన్నారు.