మట్టి వినాయకులను ప్రతిష్టించాలి

తాండూరు వికారాబాద్

మట్టి వినాయకులను ప్రతిష్టించాలి
– మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా భ‌క్తులు మ‌ట్టి వినాయ‌కున్ని ప్ర‌తిష్టించి పూజించాల‌ని తాండూరు మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు పిలుపునిచ్చారు. చ‌వితి ఉత్స‌వాల్లో ర‌సాయ‌నాల‌తో త‌యారు చేసిన వినాయ‌కున్ని ప్ర‌తిష్టిస్తే నిమ‌జ్జ‌న స‌మ‌యంలో ప‌ర్యావ‌ర‌ణానికి ముప్పు ఏర్ప‌డే ప్ర‌మాదం ఉంద‌ని అన్నారు. గాలి, నీరు కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతి ఇంట్లో వినాయకున్ని పెట్టి పూజించే వారరందరు మట్టి వినాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. మట్టి వినాయకులను ప్రతిష్టించి పూజించి ప‌ర్యావ‌ర‌ణ‌ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆమె ప‌ట్ట‌ణ ప్ర‌జ‌లంద‌రికి వినాయ‌క చ‌వితి శుభాకాంక్ష‌లు తెలిపారు.