రేపు ఉదయమే ఎమ్మెల్సీ రిజల్ట్
– ఇంకా కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు
– 50 శాతం మించని మొదటి ప్రాధాన్యత
– రెండో ప్రాధాన్యతోనే అభ్యర్థి గెలుపు
హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఫలితాలు రేపు ఉదయమే వెల్లడి కానున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిందని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ప్రియాంక అలా వెల్లడించారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తరువాతే అభ్యర్థి గెలుపును ప్రకటిస్తామని చెపారు. మొదటి ప్రాధాతన్యతలో ఏ అభ్యర్థికి 50శాతం కంటే ఎక్కువ ఓట్లు రానందున రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు చేపట్టినట్టు తెలిపారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఎవరెవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో వెల్లడించారు. ఏవీఎన్ రెడ్డికి 7,505, చెన్నకేశవరెడ్డికి 6,584 ఓట్లు వచ్చాయని ఆర్వో ప్రకటించారు. మొదటి ప్రాధాన్యత ఓట్లలో ఏవీఎన్ రెడ్డికి 921 ఓట్ల మెజారిటీ వచ్చిందని తెలిపారు. అయితే కౌంటింగ్‌లో 452ఓట్లు చెల్లలేనివి ఉన్నాయని తెలిపారు. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థులను ఎలిమినేషన్ చేస్తున్నామని వివరించారు. మొత్తం 3 షిఫ్టుల్లో లెక్కింపు సిబ్బంది పనిచేస్తున్నారని, రేపు ఉదయానికల్లా ఫలితాలు వెల్లడయ్యే అవకాశముందన్నారు. అభ్యర్థి గెలుపునకు మ్యాజిక్ ఫిగర్ 12,709 ఓట్లు పొందాలని ఆర్వో తెలిపారు.

