రక్తదానం చేసిన కుక్క..!
– గర్భణీని శునకానికి ప్రాణదానం
– శునక మానవత్వానికి జేజేలు
– సోషల్ మీడియాలో వైరల్ అయిన న్యూస్
దర్శిని డెస్క్: విశ్వాసానికి మారుపేరుగా నిలిచే శునకాల్లో మానవత్వం కూడ ఉంటుంది. చాలా సందర్భాలలో అలాంటి దృశ్యాలు కనిపిస్తుంటాయి. తాజాగా ఓ శునకం గర్భిణీగా ఉన్న మరో శునకానికి రక్తదానం చేసి పెద్ద మనసును చాటుకుంది. కర్ణాటక రాష్ట్రంలో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని హవేరిలోని హనగల్ తాలూకాలోని అక్కి ఆలూర్ రక్తదాన కేంద్రానికి అనారోగ్యంతో ఉన్న జిప్సీ అనే రెండు నెలల శునకాన్ని యజమాని తీసుకవచ్చారు. పరీక్షించిన వైద్యులు జిప్సీ రక్తలేమి సమస్యతో బాధపడుతోందని, గర్భిణీగా ఉందని గుర్తించారు. శునకం ఆరోగ్యంగా మారాలంటే మరో శునకం రక్తం అవసరం ఉంటుందని యజమానికి తెలిపారు. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న జిమ్మి అనే శునకం యజమాని వైభవ్ పాటిల్ దాని రక్తాన్ని దానం చేయించేందుకు ముందుకు వచ్చాడు. దీంతో వైద్యుల పర్యవేక్షణలో గర్భిణిగా జిప్సీకి జిమ్మి రక్తం అందించడం వల్ల.. ఇప్పుడు దాని ఆరోగ్యం మెరుగుపడింది. రక్తం డొనేట్ చేసినందుకు జిప్సీ యజమాని.. జిమ్మీ యజమానికి ధన్యవాదాలు తెలిపారు. హవేరిలోని హనగల్ తాలూకాలోని అక్కి ఆలూర్ కేంద్రంలో రక్తదాతల బృందం ఏర్పడింది. రక్తం అవసరమైన వారికి సహాయం చేసేందుకు ప్రతి ఇంట్లో ఒక శునక రక్త దాత ఉంటారు. జిప్సీ, జిమ్మీల యజమానులు కూడా ఈ బృందంలో సభ్యులుగా ఉన్నారు. మనుషుల లాగానే శునకాలకు అవసరమైనప్పుడు రక్తం లభించడం గొప్ప విశేషం. ఈ శునక మానవత్వానికి అందరు జేజేలు పలుకుతున్నారు. ఈ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

