హెల్మెట్‌ లేని ప్రయాణం ప్రమాదకరం

క్రైం తాండూరు వికారాబాద్

హెల్మెట్‌ లేని ప్రయాణం ప్రమాదకరం
– అందరు హెల్మెట్ తప్పక ధరించాలి
– తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి: హెల్మెట్‌ లేని ప్రయాణం ప్రమాదకరమని తాండూరు డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ అన్నారు. గురువారం వికారాబాద్‌ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఆదేశాల మేరకు తాండూరు పట్టణ పోలీస్టేషన్‌ ఆధ్వర్యంలో పట్టణంలో హెల్మెట్‌ ధరించి బైక్‌ ర్యాలీ నిర్వహించారు. పోలీసుస్టేషన్ నుంచీ ప్రారంభమైన బైక్‌ ర్యాలీ బస్టాండ్, వినాయక్ చౌక్, రైల్వే స్టేషన్, పాత తాండూరు, భద్రేశ్వర చౌక్, గాంధీ చౌక్, వీవీహెచ్ఎస్‌, శివాజీ చౌక్, రామ్ మందిర్, గుండు పీర్లు, సాయిపుర్ తాత గుడి, విలియం మూన్ చౌరస్తా తదితర ప్రాంతాలలో కొనసాగింది. ఈ ర్యాలీలో డీఎస్పీ శేఖర్ గౌడ్, సీఐ రాజేందర్ రెడ్డి, ఎస్ఐలు మహిపాల్ రెడ్డి, వేణుగోపాల్ గౌడ్‌తో పాటు 50 మంది సిబ్బంది పాల్గొన్నారు. అందరు హెల్మెట్‌ ధరించి వాడకంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శేఖర్ గౌడ్, టౌన్ సీఐ రాజేందర్‌ రెడ్డిలు మాట్లాడుతూ గత మూడేళ్లలో జరిగిన రోడ్డు ప్రమాదాల సర్వేలో బైకుపై ప్రయాణించిన వారే ప్రమాదాలకు గురయ్యారని తెలిపారు. ఇందులో తలకు గాయాలై చనిపోయిన వారే అత్యధికంగా ఉన్నారని చెప్పారు. హెల్మెట్ లేని ప్రయాణాలు ప్రమాదకరమన్నారు. కావున ప్రతి ఒక్కరు పట్టణంలో గాని, బయటకు వెళ్లినా గాని ఎక్కడికి వెళ్ళినా తప్పనిసరిగా హెల్మెట్ ధరించి బయటికి వెళ్లాలని సూచించారు. అందరు బాధ్యతగా హెల్మెట్ ధరించి రోడ్డు ప్రమాదాల నియంత్రణకు తోడ్పాటు అందించాలన్నారు.