పోట్లీ మహారాజ్ కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి ముహుర్తం
– ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఏర్పాట్లు సిద్దం చేసిన ఆలయ కమిటి
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని పోట్లీ మహారాజ్ దేవాలయ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవానికి ముహూర్తము ఖరారయ్యింది. ఆలయ కమిటి అధ్యక్షులుగా తర్లపల్లి భానుకుమార్ తెలిపారు. అధ్యక్షులుగా తర్లపల్లి భానుకుమార్, కార్యవర్గ సభ్యులుగా డి.చంద్రశేఖర్, ఎస్.ప్రశాంత్, కె. సునితా వెంకటయ్య, ఈ.నరేందర్ గౌడ్, ఎం. గుండప్ప, వై.సిద్ధరామప్ప, ఎక్స్ ఆఫీసియో సభ్యులుగా ఆలయ అర్చకులు కె. అనంతభట్టులు ఎంపికైన విషయం తెలిసిందే. నూతన కార్యవకర్గ ప్రమాణ స్వీకారోత్సవాన్ని ఏర్పాట్లు చేశారు. సోమవారం మధ్యాహ్నం 12-03 గంటలకు జరిగే ప్రమాణ స్వీకారోత్సవానికి తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు కూడ హాజరువుతున్నారని నూతన చైర్మన్ తర్లపల్లి భానుకుమార్ తెలిపారు. ఈ కార్యక్రమానికి నేతలు, భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.

