రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయ కక్ష్యే..!

తాండూరు రాజకీయం వికారాబాద్

రాహుల్ గాంధీపై అనర్హత వేటు రాజకీయ కక్ష్యే..!
– బీజేపీ కుట్రలను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సిద్ధం
– కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుంది
– తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్
తాండూరు, దర్శిని ప్రతినిధి : రాజకీయ కక్ష్యతోనే రాహుల్ గాంధీపై బీజేపీ అనర్హత వేటు కుట్రకు పాల్పడిందని కాంగ్రెస్ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ గౌడ్ అన్నారు. శనివారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ కాంగ్రెస్ జాతీయ నాయకులు, ఎంపి రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడాన్ని ఖండించారు. దేశం కోసం, దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ కుటుంబం ప్రాణత్యాగాలు చేసిందని గుర్తుచేశారు. దేశంలో పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలతో పాటు దేశాన్ని కుదిపేస్తున్న ఆదాని- హిడెన్ బర్గ్ అంశంపై పార్లమెంట్ లో మాట్లాడొద్దనే ఉద్దేశంతో బీజేపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసి.. రాజకీయ కుట్రకు పాల్పడిందన్నారు. కేంద్ర ప్రభుత్వం నియంతలాగ మారి కోర్టులలో న్యాయవాదులను మార్చి తప్పుడు నివేధికలతో రాహుల్ గాంధీని జైలుకు పంపే పన్నాగం పన్నుతుందోని విమర్శించారు. బీజేపీ ఎన్ని కుట్రలు, కుంత్రాలకు పాల్పడిన రాహుల్ గాంధీ భయపడేది లేదని, ఆయనకు కాంగ్రెస్ పార్టీ పూర్తి అండగా ఉంటుందన్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో పాటు నాయకులుగా మేము అండగా ఉంటామని పేర్కొన్నారు.