రొంపల్లి ఇంటికి రాజకీయ ప్రముఖులు
– అట్టహాసంగా నూతన గృహ ప్రవేశ వేడుకలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణంలోని సామాజిక సేవకుడు, టీఆర్ఎస్ యువ నాయకుడు రొంపల్లి సంతోష్ కుమార్ నివాసానికి పలువురు రాజకీయ ప్రముఖులు తరలివచ్చారు. ఆదివారం తాండూరు పట్టణంలోని నెహ్రుగంజ్ సమీపంలో రొంపల్లి సంతోష్ కుమార్ నూతన గృహ ప్రవేశ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా రొంపల్లి నివాసంలో గృహ ప్రవేశ వేడుక సందర్భంగా నిర్వహించిన పూజలో సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వారు రొంపల్లి సంతోష్ కుమార్‌కు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కరణం పురుషోత్తంరావు, టీఆర్ఎస్ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, పశుగణాభివృద్ధి సంస్థ జిల్లా చైర్మన్ గాజీపూర్ నారాయణరెడ్డి, పెద్దేముల్ పీఏసీఎస్ చైర్మన్ ద్యావరి విష్ణువర్దన్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, సాయిపూర్ బాల్ రెడ్డి, మసూద్, మన్మోహన్ సర్డా, బోయరాజు, టీఆర్ఎస్‌వై రాష్ట్ర నాయకులు బిర్కడ్ రఘు, కౌన్సిలర్ రాము, యువకులు అశోక్, యూత్ కాంగ్రెస్ నాయకులు కావలి సంతోష్‌కుమార్, పట్టణ ప్రముఖులు, వ్యాపారులు, సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
