పైలెట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌…!

తాండూరు రాజకీయం వికారాబాద్

పైలెట్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌…!
– చెంగోల్‌లో స్వాగత హంగామా
– ఏర్పాట్లతో అదరగొట్టిన రాకేష్ గౌడ్‌
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మండలంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె పల్లెకు పైలెట్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. రెండో రోజు మంగళవారం తాండూరు మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి ఘన స్వాగతాలు లభించాయి. చెంగోల్‌ గ్రామంలో బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి రాకేష్‌ గౌడ్‌ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి గ్రాండ్ వెల్‌కమ్ పలికారు.

జీప్సీ వాహనంలో రాకేష్ గౌడ్‌ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి భారీ గజమాల వేసి సత్కరించారు. మండలంలో కనివిని ఎరుగని రీతిలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి రాకేష్‌ గౌడ్‌ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగి ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా రాకేష్‌ గౌడ్ మాట్లాడుతూ తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతర కృషి చేస్తున్న ఎమ్మెల్యే రోహిత్‌ రెడ్డిని మళ్లీ ఎమ్మెల్యేగా గెలిపించుకుని తీరుతామని అన్నారు. మరోవైపు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి గ్రామాలకు వచ్చి ప్రజల సమస్యలను స్వయంగా తెలుసుకోవడంపై అందరు జేజేలు పలుకుతున్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు, ప్రజా ప్రతినిధులు, చైర్మన్‌లు, యువనాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.