ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు
– మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి
తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి అన్నారు. సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిర్వహించిన ప్రజావాణిలో 5 ఫిర్యాదులు అందాయి. ఇందులో 3 ఆసరా ఫించన్‌కు సంబంధించినవి కాగా.. మరో రెండు ఇందిరమ్మ కాలనీలో మురుగు నీరు రోడ్డుపై పారుతుందని వార్డు కౌన్సిలర్ వెంకన్నగౌడ్‌తో కలిసి కాలనీ వాసులు ఫిర్యాదులు అందజేశారు. ఈ ఫిర్యాదులను సంబంధిత అధికారులు ద్వారా పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని మేనేజర్ నరేందర్ రెడ్డి తెలిపారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రతి సోమవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆసరా ఫించన్లు, బర్త్ అండ్ డెర్త్, పారిశుద్ధ్యం సమస్యలపై ఫిర్యాదులు సమర్పించవచ్చని తెలిపారు.

