మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్

తాండూరు రాజకీయం వికారాబాద్
మున్సిపల్ కార్మికుల సమ్మె సైరన్
– వచ్చే 5 నుంచి విధుల బహిష్కరణ
– అధికారులకు సమ్మె నోటీసులు అందజేత
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు మున్సిపల్ కార్మికులు సమ్మె సైరన్ మోగించనున్నారు. వచ్చే నెల 5నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతున్నట్లు మున్సిపల్ స్టాఫ్ అండ్ ఔట్ సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ నాయకులు తెలిపారు. ఈ మేరకు తాండూరు మున్సిపల్, పోలీసు, ఆర్అండ్ తదితర శాఖల అధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మున్సిపల్ కార్మికులకు 11వ పీఆర్సీ కింద 30 శాతం వేతనాలను పెంచిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో అన్ని మున్సిపాల్టీలో అమలవుతున్న ఈ విధానం తాండూరు మున్సిపల్ 16 నెలలుగా పెండింగ్లో ఉందని తెలిపారు. గతంలో ఈ విషయమై సమ్మే చేస్తే ఎజెండా కోర్టులో పరిధిలో ఉందని, జిల్లా కలెక్టర్, సీడీఎంఏ దృష్టికి తీసుకు వెళ్లి పరిష్కరిస్తామని హామి ఇచ్చారని తెలిపారు. నేటి వరకు సమస్యను అధికారులు, పాలకులు పరిష్కరించకపోవడంతో పెంచిన జీతాలు అమలు కావడం లేదన్నారు. ఈ కారణంగా వచ్చే నెల 5 నుంచి విధులు బహిష్కరించి సమ్మెకు దిగుతున్నట్లు నోటీసుల ద్వారా పేర్కొన్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి పెంచిన పీఆర్సీతో పాటు బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు గోరేప్ప, గోపాల్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.