గౌతాపూర్ గౌరవాన్ని మరింత పెంచుతాం

తాండూరు రాజకీయం వికారాబాద్

గౌతాపూర్ గౌరవాన్ని మరింత పెంచుతాం
– అందరి సహకారంతోనే ఉత్తమ పంచాయతీ
– సర్పంచ్ రాజప్ప గౌడ్, సెక్రటరీ ఫక్రోజీలకు సన్మానం
తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలోని గౌతాపూర్ గ్రామ గౌరవాన్ని పెంచేలా మరింత కృషి చేస్తామని సర్పంచ్ రాజప్ప గౌడ్ అన్నారు. గౌతాపూర్ గ్రామం మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ పంచాయతీగా నిలవడం పట్ల గ్రామ మహిళ సంఘాల సభ్యులు మంగళవారం సర్పంచ్ రాజప్ప గౌడ్, సెక్రటరీ ఫక్రోజీలను సన్మానించారు. వారికి శాలువా, పూలమాలలు వేసి శుభాకంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ రాజప్ప గౌడ్ మాట్లాడుతూ గ్రామాన్ని ఉత్తమ పంచాయతీగా నిలపడంలో అందరి పాత్ర ఉందన్నారు. అధికారులు, రాజకీయ ప్రతినిధులు, రైతులు, మహిళ సంఘాలు, వైద్య, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికుల సహాకారంతో సాధ్యమయ్యిందన్నారు. రానున్న కాలంలో కూడా అందరి సహాకారంతో గౌతాపూర్ గ్రామాన్ని మరింత ఆదర్శంగా నిలిపేలా కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళ సంఘం అధ్యక్షురాలు యాదమ్మ, వివికే విజయలక్ష్మీ, సంఘం మహిళలు తదితరులు పాల్గొన్నారు.

పూలేకు నివాళులు
అనంతరం పంచాయతీ కార్యాలయంలో భారత మొట్ట మొదటి ఉపాధ్యాయుడు, సామాజిక ఉద్యమకర్త మహాత్మ జ్యోతిబాపూలే జయంతిని నిర్వహించారు. జ్యోతిబాపూలే చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.