ఇంటింటా రంజాన్ సంతోషం వెల్లివిరియాలి

తాండూరు రాజకీయం వికారాబాద్

ఇంటింటా రంజాన్ సంతోషం వెల్లివిరియాలి
– మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు
– సాయిపూర్‌లో రంజాన్ తోఫాల పంపిణీ
తాండూరు, దర్శిని ప్రతినిధి: ముస్లిం సోదరుల ఇంటింటా రంజాన్ సంతోషం వెల్లివిరియాలని తాండూరు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలు ఆకాంక్షించారు. శుక్రవారం తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డ్ లో రంజాన్ పండుగ సందర్భంగా ప్రభుత్వం మంజూరు చేసిన తోఫాలను వైస్ చైర్ పర్సన్ దీపా నర్సింలు చేతుల మీదుగా మైనారిటీ సోదర సోదరీమణులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం హిందువులకు బతుకమ్మ పండుగకు చీరల పంపిణీ, క్రిస్మస్ సందర్భంగా క్రిస్టియన్లకు కానుకలు, ముస్లింలకు రంజాన్ పండుగను పురస్కరించుకుని పేద ప్రజానీకానికి రంజాన్ తోఫాలను అందజేస్తు అన్ని వర్గాల పండగలకు సమప్రాధాన్యమిస్తోందన్నారు. తెలంగాణను మత సామరస్యానికి ప్రతీకగా నిలిపే లక్ష్యంలో భాగంగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అన్నారు. కావున ప్రభుత్వం అందిస్తున్న తోఫాలతో ముస్లిం సోదరులు రంజాన్‌ పండగను ఇంటింటా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు తాండూరు ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌ రెడ్డి కూడా మైనారిటీలకు సంక్షేమానికి, అభివృద్ధికి తోడ్పడుతున్నారని అన్నారు. మైనారిటీల ప్రార్థన మందిరాల అభివృద్ధికి ప్రత్యేక నిధులను సైతం కేటాయించడం జరిగిందని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.