నవాంద్గిలో.. హుబ్లీ సైరన్..!

తాండూరు తెలంగాణ రాజకీయం వికారాబాద్

నవాంద్గిలో.. హుబ్లీ సైరన్..!
– నెరవేరిన బషీబాద్ వాసుల కల
– ఫలించిన ఎంపీ కొండా కృషి
– హాల్టింగ్ సర్వీసుపై హర్షం
– రైల్లో ప్రయాణించిన ఎంపీ, ఎమ్మెల్యే
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గంలోని బషీరాబాద్ మండల పరిధిలోని నవాంద్గిలో హుబ్లీ ట్రైన్ సైరన్‌ కూత సంతోషాన్ని పంచింది. ఎన్నో ఏళ్లుగా హల్టింగ్‌ కోసం చేసిన పోరాటం ఫలించింది. బషీరాబాద్‌ మండల ప్రజలకు ఇచ్చిన హామిని చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి నెరవేర్చుకున్నారు.

శుక్రవారం బషీరాబాద్‌ మండలం నవాంద్గి రైల్వే స్టేషన్‌ లో హుబ్లీ ట్రైన్ నిలుపుదల సేవలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి చేవేళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిలు హాజరయ్యారు. సరిగ్గా సమయానికి హుబ్లీ ట్రైన్‌ స్టేషన్‌కు చేరుకుంది. అందమైన పువ్వులతో ట్రైన్‌ను అలంకరించారు. ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో కలిసి ట్రైన్ పైలెట్, ప్రతినిధులను సన్మానించారు. అనంతరం జెండా ఊపి రైలుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ వెంటనే అదే ట్రైన్‌లో ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, స్థానిక నేతలు ప్రయాణించారు.

నావంద్గి నుంచి తాండూరు వరకు ప్రయాణించారు. అక్కడ మీడియాతో మాట్లాడారు. ఎంపీ మాట్లాడుతూ రెండున్నరేళ్లనుంచి నవాంద్గిలో హుబ్లీ ట్రైన్‌ను నిలపాలని ప్రయత్నాలు చేయడం జరిగిందన్నారు. ప్రధాన మంత్రి, రైల్వే మంత్రులు, జీఎం, ఏజీఎంలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాపై నవాంద్గి ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని నెరవేర్చడం సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ హుబ్లీ ట్రైన్‌ నిలుపుదల విషయంలో తాము కూడా సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని గుర్తుచేశారు. నవాంద్గిలో హుబ్లీ ట్రైన్ నిలుపుల చేయడం అభినందనీయమని అన్నారు.

ఈ సౌకర్యంతో ఇక్కడి ప్రజలకు, ప్రయాణికులకు ఎంతో మేలు జరగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలేశ్వర్ గుప్త, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్‌ కుమార్, నవాంద్గి సర్పంచ్ వెంకటేష్‌ మహరాజ్, మార్కెట్ కమిటి చైర్మన్ మాధవరెడ్డి, ఆత్మ కమిటి చైర్మన్ శంకర్ రెడ్డి, డీసీసీబీ మాజీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాకేష్ మహరాజ్, సోసైటీ మాజీ చైర్మన్ వెంకట్ రాంరెడ్డి, మాజీ వైస్ చైర్మన్ అజయ్ ప్రసాద్, మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ రాములు నాయక్, బాల్ రెడ్డి, స్థానికులు తదితరులు ఉన్నారు.

గ్రామాలను ప్రగతి బాట పట్టిస్తాం..!