మెరుగైన వైద్య సేవలందించాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్
– తాండూరులో సాయి రాఘవ ఆసుపత్రి ప్రారంభం
– 24 గంటల పాటు అందుబాటులో వైద్య సేవలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : రోగులకు, బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. ఆదివారం తాండూరు పట్టణం మార్వాడి బజార్ రోడ్డు మార్గంలోని షౌకత్ పటేల్ కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన సాయి రాఘవ హస్పిటల్‌ను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీపా నర్సింలులు ప్రారంభించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సాయి రాఘవ ఆసుపత్రిలో 24 గంటల పాటు వైద్య సేవలను అందుబాటులో ఉంచడం అభినందనీయమన్నారు. పేదలకు, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు.
ఆసుపత్రి వైద్యులు డా.కె.సాయి రాఘవరెడ్డి మాట్లాడుతూ నూతనంగా ప్రారంభించిన ఆసుపత్రిలో 24 గంటల వైద్య సేవలు అందించడం జరగుతుందన్నారు. ఇందులో ఈసీజీ, లాబ్, ఫార్మసీ, ఐపీ సేవలు ఉంటాయని తెలిపారు. ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం), మాజీ పట్టణ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ నారాయణరెడ్డి, వార్డు కౌన్సిలర్ బంటారం లావణ్య, కౌన్సిలర్ విజయాదేవి, మాజీ కౌన్సిలర్లు జుబేర్ లాల, వాలి శాంతుకుమార్, నాయకులు షౌకత్ పటేల్, ఎంఐఎం హాది, బీజేపి నాయకులు బంటారం భద్రేశ్వర్, ఐఎంఏ రాష్ట్ర జోనల్ కార్యదర్శి డా.జగదీశ్వర్ రెడ్డి, తాండూరు ప్రెసిడెంట్ మల్లికార్జున్, కోశాధికారి శరత్ చంద్ర, ఆసుపత్రి ప్రతినిధి జంగా మహేందర్ రెడ్డి తదితరలు పాల్గొన్నారు.

