క్రీడా క్యాంపులతో నైపుణ్యాలు మెరుగు
– క్యాంపు ఇంచార్జులు అనంతయ్య, రాములు
– తాండూరు వేధిక్ విశిష్ఠ లో సమ్మర్ క్యాంపు ప్రారంభం
తాండూరు, దర్శిని ప్రతినిధి: క్రీడల్లో చురుకుగా పాల్గొంటే నైపుణ్యాలు మెరుగు పడతాయని క్రీడా ఇంచార్జ్ లు, పీఈటీలు అనంతయ్య, రాములు అన్నారు. తెలంగాణ స్పోర్ట్ అథారిటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం తాండూరు పట్టణంలోని వేధిక్ విశిష్ఠ స్కూల్లో వాలీబాల్, ఖోఖో ఉచిత సమ్మర్ కోచింగ్ క్యాంపు ఏర్పాటు చేశారు. నెలరోజుల పాటు నిర్వహించే ఈ క్యాంపును లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించేందుకు తెలంగాణ స్పోర్ట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉచిత సమ్మర్ క్యాంపులు నిర్వహిస్తున్నారని తెలిపారు. విద్యార్థులు సెలవులను వృథా చేయకుండా ఉచిత క్యాంపును సద్వినియోగం చేసుకుని క్రీడా నైపుణ్యాలను మెరుగు పరుచుకోవాలన్నారు. క్రీడలపై ఆసక్తి ఉన్న ఇతర పాఠశాలల విద్యార్థులు కూడ ఈ క్రీడా క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్ మహిపాల్ రెడ్డి, విద్యార్థులు పాల్గొన్నారు.

