తట్టెపల్లిలో ఉద్రిక్తత..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తట్టెపల్లిలో ఉద్రిక్తత..!
– మండల సాధన దీక్ష భగ్నం
– ఆందోళన కారులను అరెస్టు చేసిన పోలీసులు
– 32 రోజుల పోరాట దీక్ష నిర్వీర్యం
– అనుమల్లేకుండా దీక్ష చేస్తే చర్యలంటూ హెచ్చరిక
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్‌ జిల్లా పెద్దేముల్లో మండలంలోని తట్టెపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. తట్టెపల్లిని కొత్త మండలంగా ప్రకటించాలని స్థానికులు డిమాండ్ చేస్తూ చేస్తున్న పోరాటానికి చుక్కెదురు అయ్యింది. మండల సాధన కమిటి ద్వారా చేపడుతున్న దీక్షను పోలీసులు భగ్నం చేశారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్ మండలంలో తట్టెపల్లి గ్రామం మేజర్ పంచాయతీగా ఉంది. పరిసర ప్రాంతాల్లో గ్రామాలు, తాండా పంచాయతీలు కూడా ఉన్నాయి. వీటన్నింటిని కలుపుకుని మండలంగా ఏర్పాటు చేయాలని గత కొన్నేండ్ల నుంచి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం సాధన కమిటిని కూడా ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా తట్టెపల్లిని మండల కేంద్రంగా ప్రకటించాలని నెలరోజుల క్రితం నుంచి దీక్ష చేపడుతున్నారు. ప్రతిరోజు తట్టపల్లి ప్రాంతంలోని గిరిజన తండాల యువకులు, నాయకులు పెద్ద ఎత్తున రోజువారీగా దీక్ష ద్వారా నిరసన చేపడుతున్నారు.          (ఇంకావుంది.. కింద చదవండి)

సోమవారం ఉదయం తాండూరు రూరల్ సీఐ రాంబాబు దీక్ష శిబిరానికి సిబ్బందితో కలిసి వచ్చారు. అనుమతి లేకుండా దీక్ష చేస్తున్నారని అభ్యంతరం తెలిపారు. నిరసనలో పాల్గొన్న సాధన కమిటీ సభ్యులతో పాటు పలువురుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీంతో నిరసన కారులు, స్థానికులు పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయినా కూడా పోలీసులు అందరిని చెదరగొట్టి పరిస్థితిని అదుపు చేశారు. దీక్ష భగ్నంతో తట్టెపల్లి మండల సాధనకు చుక్కెదురు అయ్యింది. అయినా కూడా తట్టెపల్లి మండల సాధనకు పోరాటం చేస్తామని ఆందోళన కారులు పేర్కొన్నారు. పోలీసులు అరెస్టు చేసిన వారిలో తట్టపల్లి ఎంపీటీసీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గోపాల్, మాజీ ప్రాథమిక వ్యవసాయ డైరెక్టర్ ప్రభు కుమార్ తదితరులున్నారు.

ఇవి కూడా చదవండి..

పైలెట్ పెద్ద మనసు..!
– మైనార్టీల కోసం రూ. 7.31 కోట్లు కేటాయింపు
– నిధుల మంజూరు ఘనత ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– కృతజ్ఞతలు తెలిపిన అఫ్పూ(నయూం)
https://dharshininews.com/16983