సాయి మేధా విజయఢంకా..!
– పదోతరగతి ఫలితాల్లో 100% ఉత్తీర్ణత
– అభినందించిన యజమాన్యం
తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు పట్టణం శివాజీ చౌక్ లోని శ్రీ సాయి మేధ విద్యాలయ పదోతరగతి ఫలితాలలో విజయఢంకా మోగించింది. పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పాఠశాల యాజమాన్యం అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ పెరుమాళ్ల వెంకట్ రెడ్డి మాట్లాడుతూ చదువుతోపాటు క్రమశిక్షణతో కూడిన విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులకు గ్రేడ్లు ముఖ్యం కాదని క్రమశిక్షణతో కూడిన చదువు ముఖ్యమని పేర్కొన్నారు. తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థులు బాధపడకూడదని అన్నారు. భవిష్యత్తులో మంచి ఫలితాలు సాధించుటకు కృషి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల ఏర్పాటు చేసినప్పటి నుంచి నేటి వరకు 100% ఉత్తీర్ణత సాధిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ రమేష్ గౌడ్, రోహిత్ కుమార్, ప్రిన్సిపల్ సజిత, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.

ఇది కూడా చదవండి…
ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్‌నే చంపేశాడు..!
– ఉన్మాది దాడిలో మరో నలుగురికి గాయాలు
– కేరళలో చోటు చేసుకున్న దారుణం
– సుమోటోగా తీసుకున్న హుమన్ రైట్స్ కమీషన్
– తీవ్ర సంచలనమైన ఘటన
https://dharshininews.com/17082

