తుది దశకు డబుల్ జాబితా..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తుది దశకు డబుల్ జాబితా..!
– ఈనెల 20వరకు ఎంపికకు గడువు
– ముందు అతి నిరుపేదలకు మంజూరు
– మిగతా వారికి ల్యాటరీ ద్వారా కేటాయింపు
– వికారాబాద్‌ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
వికారాబాద్, దర్శిని ప్రతినిధి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్దిదారుల ఎంపిక తుదిదశకు తీసుకరావాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా ఆర్డీవోలు, తహసీల్దార్లతో డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపికపై సమీక్ష జరిపారు. జిల్లాలో డబుల్ బెడ్‌ రూం ఇండ్ల మంజూరు పనులు ఏ దశలో ఉన్నాయని ఆరా తీశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అధికారులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. డబుల్ బెడ్ ఇండ్ల కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధుల సమన్వయంతో డబుల్ లబ్ధిదారుల ఎంపికను పారదర్శకంగా చేపట్టాలన్నారు. కనీసం 20 శాతం మంది అతి నిరుపేద లబ్ధిదారుల ఎంపిక చేయాలన్నారు. తర్వాత లాటరీ పద్ధతిలో మిగతా వారిని ఎంపిక చేయాలన్నారు. తుది జాబితాను ఈనెల 20 వరకు అందజేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ శర్మ, వికారాబాద్, తాండూరు ఆర్డీఓలు విజయ కుమారి, అశోక్ కుమార్ లతో పాటు సంబంధిత తాండూరు, పరిగి, కోడంగల్, మర్పల్లి, ధరూర్, చౌడాపూర్ మండలాల తహసిల్దార్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

అయ్యో.. దత్తాత్రేయశ్వరా..!
– స్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన దుండగులు
– శక్తిపీఠాల పూజల కోసం అని పుకార్లు
– తాండూరు మండలం జినుగుర్తిలో ఘటన
https://dharshininews.com/17118