పైలెట్‌తోనే పట్టణాభివృద్ధి..!
– రూ.80లక్షలతో 25,6వ వార్డుల్లో అభివృద్ధి పనులు
– బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం)
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డితోనే పట్టణ అభివృద్ధి జరుగుతోందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు అఫ్పూ(నయూం) అన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ తాండూరు అభివృద్ధి కోసం ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నిరంతర కృషి చేస్తున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ సహాకారంతో తాండూరు నియోజకవర్గ అభివృద్ధి కోసం సాధించిన రూ. 134 కోట్ల నిధులలో పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని 25వ వార్డు, 6 వ వార్డులో పనులకు రూ.80 లక్షలు నిధులు మంజూరు చేయడం జరిగిందన్నారు. ఈ నిధులతోనే పట్టణంలోని పీపుల్స్ కాలేజీ ముందు నుంచి చంద్రథియేటర్ వరకు రూ. 35 లక్షలతో బీటీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందన్నారు. ఎమ్మెల్యే పార్టీలకతీతంగా ఈ నిధులను కేటాయించడం జరిగిందని గుర్తుచేశారు. పట్టణంలోని అన్ని వార్డుల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోన్న ఎమ్మెల్యే రోహిత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇది కూడా చదవండి…
స్కూల్లో బ్రేక్ ఫాస్ట్..!
– సర్కారు బడులలో అమలు
– వచ్చే ఏడాది నుంచి కొత్త మెను
https://dharshininews.com/17189


