బీజేపీలో కమలమిత్ర జోష్‌

తాండూరు రాజకీయం వికారాబాద్

బీజేపీలో కమలమిత్ర జోష్‌
– టాప్ వన్‌గా నిలిచిన వికారాబాధ్‌ జిల్లా
– అభినందించిన రాష్ట్ర అధ్యక్షురాలు గీతామూర్తి
– హర్షం వ్యక్తం చేసిన జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత
తాండూరు, దర్శిని ప్రతినిధి: దేశంలో మహిళ సాధికారత కోసం బీజేపీ ప్రవేశ పెట్టిన కమల మిత్ర కార్యక్రమం వికారాబాద్‌ జిల్లా పార్టీలో జోష్‌ నింపింది. వికారాబాద్‌ జిల్లా మహిళ మోర్చ కమిటి రాష్ట్రంలోనే టాప్‌ వన్‌గా నిలించింది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, మాతృత్వ వందన యోజన మొదలైన భారత ప్రభుత్వం యొక్క 15 ప్రముఖ పథకాలపై శిక్షణ ఇచ్చింది. ఈ పథకాలను అర్హులకు అమలు చేయడంతో పాటు మహిళలను చైతన్య పరచడం ముఖ్య ఉద్దేశం. జిల్లాలో వికారాబాద్‌ మహిళ మోర్చ కమిటి కార్యక్రమం విజయవంతానికి విస్తృతంగా కృషి చేసింది. దీంతో పాటు మహిళల ఆన్‌లైన్ సభ్యత్వం చేయడంలో ముందు వరుసలో ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన మహిళ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షురాలు గీతా మూర్తి వికారాబాద్‌ జిల్లా మహిళ మోర్చ కమిటి కమల మిత్రలో టాప్‌వన్‌గా నిలిచిందని ప్రకటించారు. వికారాబాద్‌ జిల్లా మహిళ మోర్చ అధ్యక్షురాలు సాహు శ్రీలతను అభినందించారు. ఈ సందర్బంగా జిల్లా అధ్యక్షురాలు సాహు శ్రీలత మాట్లాడుతూ కమల మిత్రను ఆదర్శంగా నిలపడం కోసం నిరంతరం కృషి చేయడం జరిగింది. దాని ఫలితంగా ఆదర్శంగా నిలవడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా మోర్చ అసెంబ్లీ కన్వినర్ రేణుక, పాలసీ కన్వినర్ శృతి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…
సూపర్ పోలీస్..!
– నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న దొంగ
– చాకచక్యంగా పట్టుకున్న తాండూరు పోలీసులు
– డీఎస్పీ చేతుల మీదుగా రివార్డులు
https://dharshininews.com/17404
chaithany collage