రూ. 1ల‌క్ష‌కు గ‌ణేషుని ల‌డ్డు వేలం

తాండూరు వికారాబాద్

రూ. 1ల‌క్ష‌కు గ‌ణేషుని ల‌డ్డు వేలం
– సొంతం చేసుకున్న వైస్ చైర్ ప‌ర్స‌న్ దీపా న‌ర్సింలు
తాండూరు, ద‌ర్శిని ప్ర‌తినిధి: తాండూరు ప‌ట్ట‌ణంలో గ‌ణేషుని ల‌డ్డుకు భ‌లే డిమాండ్ ఏర్ప‌డింది. మంగ‌ళ‌వారం వినాయ‌క నిమ‌జ్జ‌నం సంద‌ర్భంగా మండపాల వ‌ద్ద వినాయ‌కుల ల‌డ్డుల‌ను వేలం వేశారు. మున్సిప‌ల్ ప‌రిధి పాత తాండూరులోని గ‌ణేషుని ల‌డ్డు రూ. 1ల‌క్ష‌కు వేలం అయ్యింది. ఈ ల‌డ్డును మున్సిప‌ల్ వైస్ చైర్ ప‌ర్స‌న్ ప‌ట్లోళ్ల దీపా న‌ర్సింలు ఫోన్ ద్వారా వేలంలో పాల్గొని ల‌డ్డును సొంతం చేసుకున్నారు. అదేవిధంగా ప‌ట్ట‌ణంలోని వివిధ ప్రాంతాల‌లో కూడ ల‌డ్డూ వేలంపాట నిర్వ‌హించారు. ఈ వేలంలో భ‌క్తులు ఉత్స‌హాంగా పాల్గొన్నారు.