జై తెలంగాణ..!

తాండూరు రాజకీయం వికారాబాద్

జై తెలంగాణ..!
– అట్టహాసంగా దశాబ్ది ఉత్సవాలు
– ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో నేతలు
– జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
– ఎమ్మెల్సి నివాసం వద్ద తెలంగాణ సంబరాలు
– జూనియర్ కాలేజీ మైదానంలో దశాబ్ది శోభ
తాండూరు, దర్శిని ప్రతినిధి : జై తెలంగాణ, జైజై తెలంగాణ, జయహో కేసీఆర్ అంటూ నినాదాలు తాండూరులో మార్మోగాయి. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తాండూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి జెండా ఆవిష్కరించారు. అదేవిధంగా పట్టణ | లోని ఆర్డీఓ, మున్సిపల్, పోలీస్టేషన్. డీఎస్పీ, మార్కెట్ కమిటి, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి, డీసీఎంఎస్ తదితర కార్యాలయాలలో జెండా ఆవిష్కరణలు అట్టహాసంగా జరిగాయి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, పట్టణ అధ్యక్షులు అప్పూ(నయూం), నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివా స్చేరి, కౌన్సిలర్లు మంకాల రాఘవేందర్, సంతోష్ గౌడ్, హరిగౌడ్, న్యాయవాది గోపాల్ తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాయలంలో చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ, మాజీ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల రత్నమాల నర్సింలు, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నీరజాబాట్ రెడ్డి, బీజేపీ ఫ్లోర్ లీడర్ అంతారం లలిత, కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ మధుబాల. కౌన్సిలర్ మమత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ నివాసం వద్ద జరిగిన వేడుకలలో బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి కరణం పురుషోత్తంరావు, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మి, పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, మాజీ డీపీసీ సభ్యులు పట్లోళ్ల నర్సింలు, మాజీ వైస్ చైర్ పర్సన్, పట్లోళ్ల రత్నమాల, కౌన్సిలర్లు పట్లోళ్ల నీరజాబాల్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, నాయకులు సాయిపూర్ బాల్రెడ్డి, బంటు మల్లప్ప, మసూద్, రాజశేఖర్, యువనాయకులు బిర్కడ్ రఘు, తదితరులు పాల్గొన్నారు.

జూనియర్ కాలేజీలో దశాబ్ది శోభ
తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది శోభ సంతరించుకుంది. కళాశాల మైదానంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, చైర్ పర్సన్ స్వప్న పరిమళ్, ఆర్డీఓ అశోక్ కుమార్, ఫ్లోర్ లీడర్ శోభారాణి, కౌన్సిలర్లు నీరజాబాల్ రెడ్డి, విజయదేవి, సంగీత ఠాకూర్, నాయకులు పట్లోళ్ల నర్సింలు, శ్రీనివాస్ చారి, ఇంటర్ బోర్డు అధికారి శంకర్ నాయక్, కాలేజీ ప్రిన్సిపల్, నేతలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

ఇది కూడా చదవండి…
త్వరలో నా పెళ్లి..!
– నేను జైలుకు వెళ్లనంటే వెళ్లను
– కోర్టులో రిమాండ్‌ ఖైదీ హంగామా
– కోర్టులోనే తలుపు అద్దాలు ధ్వసం
https://dharshininews.com/17509

chaithany collage