ఉత్కంఠంగా వీరశైవ సంఘం ఎన్నికల ఫలితాలు
– ఇద్దరి ప్యానల్‌లో 5గురు చొప్పున గెలుపు
– మరొకరి ప్యానల్‌లో ముగ్గురి డైరెక్టర్ల గెలుపు
– స్వతంత్ర ప్యానెల్‌లో ఇద్దరి విజయం
తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు వీరశైవ సమాజం ఎన్నికల ఫలితాలు ఉత్కంఠ భరితంగా మారాయి. మొత్తం 15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికలలో ఏఒక్క ప్యానల్ కు మెజార్టీ రాకపోవడంతో అయోమయం నెలకొంది. 8 మంది డైరెక్టర్లు ఉన్న ప్యానల్ కార్యవర్గంను ఏర్పాటు చేస్తుంది. ఆర్.బస్వరాజ్ ప్యానల్ లో 5 మంది డైరెక్టర్లు గెలిచారు.(ఆర్.బస్వరాజ్, వాలి శాంతు, నిర్ని చంద్రశేఖర్, సడిగే భద్రణ్ణ, ఆవులం సంపత్ గెలిచారు) సంఘం మాజీ అధ్యక్షులు తంబాకు చంద్రశేఖర్ ప్యానల్ లో కూడా 5 మంది డైరెక్టర్లు గెలుపొందారు(తంబాకు చంద్రశేఖర్, ఘనాపూర్ శంకర్, వాలి శ్రావణ్, గాజుల శాంతు, గౌరీ శంకర్ గెలిచారు). తాజా మాజీ సంఘం అధ్యక్షులు పటేల్ శ్రీశైలం ప్యానల్ లో ముగ్గురు డైరెక్టర్లు గెలిచారు(పటేల్ శ్రీశైలం, శెట్టి భాస్కర్, గూలి పరమేశ్వర్ గెలిచారు). ఎల్.రవికుమార్ ప్యానల్ లో ఇద్దరు గెలిచారు(ఎల్.రవికుమార్, గంగా శ్రావణ్). ఈ ఎన్నికలలో అత్యధికంగా ఎల్.రవికుమార్ కు 462 ఓట్లు వచ్చాయి. 248 ఓట్లు పైబడి వచ్చిన అభ్యర్థులు డైరెక్టర్లుగా గెలుపొందారు. సోమవారం(ఈరోజు) గెలిచిన డైరెక్టర్ల ప్రమాణస్వీకారంను ఏర్పాటు చేశారు. వచ్చే 8 రోజులలో కార్యవర్గంను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. తాజా ఫలితాలలో ముగ్గురు డైరెక్టర్లు కలిగి ఉన్న తాజా మాజీ అధ్యక్షులు పటేల్ శ్రీశైలం నిర్ణయం కీలకంగా మారింది. ఎవరు ఎవరితో చేతులు కలుపుతారు అనేది ఆసక్తిగా మారింది.

ఇది కూడా చదవండి…


