ప్లీజ్… పిల్లను చూపండి..!
– వెంటనే పెళ్లి చేసుకుంటా
– సీఎం సహాయ శిబిరానికి చేరిన లేఖ
– వైరల్ అవుతున్న సామాన్యుడి వెరైటీ లెటర్
దర్శిని డెస్క్: సోషల్ మీడియా రాజ్యంలో ఎన్నోన్నో విచిత్ర సంఘటనలు వెలుగులోకి వస్తాయి. క్షణాల్లోనే ప్రపంచమంతా వ్యాపించి వైరల్ అవుతాయి. అలాంటి ఓ సంఘటన గురించే ఇప్పుడు మనం చదవబోతున్నాం. జీవింలో ఎవరైనా ఎప్పుడైనా లేఖలు(లేటర్లు/ఉత్తరాలు) రాసుంటాం. చదివి ఉంటాం. ఇందులో కొన్ని విచిత్ర అనుభవాన్ని పంచుతాయి. రాజస్థాన్‌లోని 40 ఏండ్ల వ్యక్తి తహసీల్దార్‌కు రాసిన దరఖాస్తు లేఖ ఇప్పుడు వైరల్‌గా మారింది. తనకు పెళ్లి కావాలని, పిల్లను చూడండి మహాప్రభు అంటూ రాసిన ఉత్తరం సీఎం సహాయ శిబిరానికి చేరుకుంది. రాజస్థాన్‌లోని దుబ్బం గంగద్వాడి నుంచి మహావర్ అనే వ్యక్తి ఈ లెటర్ రాసినట్లు తెలుస్తోంది. ఈ ఉత్తరంలో తన ఇంటి పరిస్థితుల గురించి వెల్లడించాడు. ……—

తన ఇంట్లో అన్నీ ప్రతికూల పరిస్థితులే ఉన్నాయని.. అందుకనే తాను పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయినట్లు పేర్కొన్నాడు. కనుక దయ చేసి తన పెళ్లికి సహాయం చేసి.. వీలైనంత త్వరగా తన ఇంటికి ఒక ఇల్లాలిని అందించండి మహాప్రభో అని వినతి చేశాడు. ఈ దరఖాస్తును తహాసీల్దార్ పేరుతో రాశాడు. ఎలాగోలా ఈ ఉత్తరం సీఎం సహయ శిబిరానికి చేర్చాడు. తహసీల్దార్‌కు రాసిన ఉత్తరంలో తనకు ఎలాంటి భార్య కావాలో తెలిపాడు. 1. సన్నగా ఉండాలి, 2. న్యాయంగా ఉండాలి, 3. వయస్సు 30 నుండి 40 సంవత్సరాల మధ్య ఉండాలని, అన్ని పనిలో నాయకత్వం లక్షణాలు ఉండాలని అభిప్రాయాలను ముందుంచాడు. ఈ దరఖాస్తును గుర్తించిన అధికారి విచారణకు ఆదేశించాడు. అదేవిధంగా @8PMnoCM అనే ఖాతా ద్వారా ఈ లేఖను ట్విట్టర్‌లో షేర్ చేశారు. చాలా విచిత్రమైన ప్రార్థన వచ్చింది’ అనే క్యాప్షన్ జత చేశారు. ఇప్పటి వరకూ 90 వేల మంది వరకు ఈ లేఖను చూశారు.. భిన్నమైన స్పందనలు సొంతం చేసుకుంటూ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది.
https://twitter.com/8PMnoCM/status/1665360174352326656?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1665360174352326656%7Ctwgr%5Efefee2cc4eacad8cc4df94b314026c042bae26b7%7Ctwcon%5Es1_c10&ref_url=https%3A%2F%2Ftv9telugu.com%2Ftrending%2Fget-me-a-wife-rajasthan-mans-letter-to-government-official-tweet-goes-viral-973545.html





