ఓం మార్కండేయ నమః..!
– ఘనంగా దేవాలయ వార్షికోత్సవం
– కన్నుల పండుగలా హోమం
తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓం మార్కండేయ నమః అంటూ భక్తులు స్వామిని వేడుకున్నారు. తాండూరు పట్టణం కోడంగల్ రోడ్డు మార్గంలోని శ్రీ శివ భక్త మార్కండేయ దేవాలయ 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. బుధవారం పద్మశాలి సమాజం ఆధ్వర్యంలో వేడుకలను నిర్వహించారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, హారతి తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జరిగిన హోమ కార్యక్రమాలు కన్నుల పండగలా జరిగింది. పలువురు దంపతులు పాల్గొని హోమం పూజా కార్యక్రమాలను చేయించారు. అదేవిధంగా పద్మశాలం సమాజంతో పాటు మార్కండేయ కాలనీకి చెందిన విద్యార్థులు పది, ఇంటర్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన సందర్భంగా వారిని అభినందిస్తూ ఘనంగా సన్మానించారు. ఈ ఉత్సవాలకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మార్కండేయ స్వామి ని దర్శించుకున్నారు. భక్తుల రాకతో పాటు పూజా కార్యక్రమాలతో దేవాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది.
ఇది కూడా చదవండి…
(లోకల్ యాడ్స్ కోసం కింద చూడండి..)






