మహిళల సంక్షేమమే సర్కారు ధ్యేయం

తాండూరు రాజకీయం వికారాబాద్

మహిళల సంక్షేమమే సర్కారు ధ్యేయం
– అభివృద్ధికి ఎన్నో పథకాలు అమలు
– తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
– ఘనంగా తెలంగాణ మహిళ సంక్షేమ సంబరాలు
తాండూరు, దర్శిని ప్రతినిధి : మహిళల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ సర్కారు పనిచేస్తోందని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా మంగళవారం తాండూరు పట్టణంలోని తులసీ గార్డెన్ లో తెలంగాణ మహిళ సంక్షేమ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం కళ్యాణ లక్ష్మీ, షాదీ ముభారక్, ఒంటరి మహిళకు ఆసరా, కేసీఆర్ కిట్, ఆరోగ్య లక్ష్మీ, ఫ్రీ స్కూల్ విద్య పథకాలను అమలు చేస్తుందన్నారు. అంతేకాకుండా అంగన్ వాడి టీచర్లు… ఆర్పీలు, ఆశలకు గౌరవ వేతనాలు అందిస్తోందన్నారు. మహిళలు, అమ్మాయిల సంరక్షణ కోసం షీటీమ్స్, షీ టాక్సీ, హెల్ప్ లైన్ వంటి పథకాలతో భద్రత చర్యలు చేపట్టిందన్నారు.

దీంతో పాటు తెలంగాణలో శిశు, మాతృ మరణాల రేటు తగ్గింపుకు చర్యలు చేపట్టిందన్నారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన అంగన్ వాడి టీచర్లకు, ఆర్పీలకు, ఇతరులకు బహుమతులు పంపిణీ చేశారు. అదేవిధంగా అంగన్ వాడి టీచర్లు ఏర్పాటు చేసిన ఫుడ్ మేళాను ఎమ్మెల్యే సందర్శించి పరిశీలించారు. అద్భుతంగా చేశారని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజుగౌడ్, ఆర్డీఓ ఆశోక్ కుమార్, కౌన్సిలర్లు విజయాదేవి, పెద్దేముల్ ఎంపీపీ అనురాధ, మహిళ సంక్షేమ శాఖ ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అంగన్ వాడి టీచర్లు, ఐకెపి ఉద్యోగులు, ఆర్సీలు, మహిళ సంఘాల ప్రతినిధులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

పైలెట్ బర్త్ డే అదుర్స్‌..!

 

chaithany collage