జిల్లా న్యాయవాది మాధవరెడ్డికి ఘన సన్మానం

తాండూరు రాజకీయం వికారాబాద్

జిల్లా న్యాయవాది మాధవరెడ్డికి ఘన సన్మానం
– సత్కరించిన తాండూరు మిత్ర బృందం
తాండూరు, దర్శిని ప్రతినిధి: వికారాబాద్ జిల్లా సీనియర్ న్యాయవాది మాధవరెడ్డిని తాండూరు మిత్ర బృందం ఘనంగా సన్మానించింది. మాధవరెడ్డి ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా నియమితులు అయ్యారు. బుధవారం తాండూరు పట్టణానికి విచ్చేసిన మాధవరెడ్డిని బుధవారం ఆయన సన్నిహితులు, మిత్రులు గజమాలతో ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీసీ జాతీయ కార్యవర్గ సభ్యులు, తాండూరు కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి, శ్రీ సాయిపుత్ర హోమ్స్ అండ్ డెవలపర్స్ అధినేత బావనోళ్ల శంకర్ యాదవ్, సుద్ధ ఫ్యాక్టరీల అధ్యక్షులు కోహీర్ రాజు, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సయ్యద్ షుకూర్, యువ నాయకులు తాండ్ర నరేష్, రాము ముదిరాజ్, రఘు, మథిన్, సయ్యద్, విష్ణు, అరుణ్, దాస్, బసవరాజ్, శివరాజ్, కే పి రాజు, రాములు, సాయి, శివ, తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి…

తాత తడబడలేదు..!

chaithany collage