ఆషాడ మాసం గోరింటా హాసం !
– సునీతమ్మకు గోరింట పెట్టిన నేతలు
తాండూరు, దర్శిని ప్రతినిధి: ఆషాడ మాసంలో గోరింటాకుకు ఎంతో విశిష్టత ఉంది. ఆషాఢం రాగానే మహిళలందరు గోరింటాకు పెట్టుకుంటారు. అయితే శనివారం జుంటిపల్లి రామస్వామి ఆలయానికి వచ్చిన సునితమ్మకు మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ విజయలక్ష్మి, బషీరాబాద్ ఎంపీపీ కరుణ, సర్పంచులు మహిళలు అందరూ గోరింటాకు పెడుతూ దరహాసం పొందారు.

ఈ సందర్భంగా జెడ్పీ చైర్ పర్సన్ సునీతారెడ్డి మాట్లాడుతూ ఆశాడంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవడం వలన వర్షాకాలంలో సూక్ష్మజీవులు అడ్డుకుని,శరీరంలో వేడిని తగ్గిస్తుందని అన్నారు. ఆచార సాంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళలు కార్యకర్తలు కూడా పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి…


