తాండూరు రైతులకు శుభవార్త..!

తాండూరు రాజకీయం వికారాబాద్

తాండూరు రైతులకు శుభవార్త..!
– వరి, మొక్క జొన్న కొనుగోలు కేంద్రాల ప్రారంభం
– పాల్గొన్న జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్
– ధాన్యం, మొక్కల మద్దతు ధర ఎంతంటే..?
తాండూరు, దర్శిని ప్రతినిధి : రైతులు పండించిన పంటలను దళారులకు విక్రయించి మోసపోవద్దని వికారాబాద్ జిల్లా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ లింగ్యా నాయక్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర పౌరసరఫరాల రంగారెడ్డి జిల్లా సంస్థ, తాండూరు డీసీఎంఎస్, రంగారెడ్డి జిల్లా తెలంగాణ మార్క్ ఫెడ్ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరు మండలంలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ కార్యక్రమానికి జిల్లా అడిషనల్ కలెక్టర్ లింగ్యా నాయక్ హాజరై తాండూరు మార్కెట్ కమిటి చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి, డీసీసీబీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ లతో కలిసి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అడిషనల్ రెవెన్యూ కలెక్టర్ లింగ్యానాయక్ మాట్లాడుతూ రైతుల పంటలకు మద్దతు ధర కల్పించేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. వరి ధాన్యంలో ఏ గ్రేడ్ కు రూ.2389, సన్న రకాలకు రూ. 2369తో పాటు బోనస్ రూ.500లు అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా సాధారణ ధాన్యానికి రూ. 2369లు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.
kvcs
అదేవిధంగా మొక్కజొన్నకు రూ. 2400 మద్దతు ధర అందించడం జరుగుతుందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు జరుపాలని నిర్వహకులను ఆదేశించారు. అనంతరం మార్కెట్ కమిటి చైర్మన్ బాల్ రెడ్డి, డీసీసీబీసీ జిల్లా వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ లు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోకుండా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించుకోవాలని సూచించారు. ఈ మద్దతు ధర పొంది కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ ప్రతినిధి మోహన్ కృష్ణ, డీఎస్ఓ సుదర్శన్, తాండూరు మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ వడ్డె శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జన్నె నాగప్ప, డైరెక్టర్ జర్నప్ప, పలువురు నాయకులు, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి…

బుయ్యని వరుడికి కవితక్క ఆశీర్వాదం..!